18150పైన ముగిసిన నిఫ్టి

రేపు వీక్లీ సెటిల్‌మెంట్ నేపథ్యంలో మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చింది. నిన్నటి నుంచి దిగువ స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టికి.. ఇవాళ ఆరంభంలో స్వల్ప ఒత్తిడి వచ్చినా వెంటనే కోలుకుంది. ఉదయం ఆరంభంలోనే 18032ను తాకిన నిఫ్టి… అక్కడి నుంచి క్రమంగా కోలుకుని 18183ని తాకింది. చివర్లో 18,165 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 112 పాయింట్లు లాభపడింది. ప్రపంచ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నా మన మార్కెట్లలో ర్యాలీ రావడం విశేషం. నిఫ్టిలో 35 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టిలో హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి నెక్ట్స్‌లో సీమన్స్ మళ్ళీ రూ. 3000 దాటింది. మిడ్ క్యాప్ షేర్లలో ట్రెంట్, జిందాల్ స్టీల్, ఆస్ట్రాల్ షేర్లు రెండు శాతం పైగా లాభంతో ముగిశాయి. నిఫ్టి బ్యాంక్ కూడా అర శాతంపైగా లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.76 శాతం లాభంతో ముగిసింది.