For Money

Business News

మరో 11వేల మందిపై మైక్రోసాఫ్ట్‌ వేటు

ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ట్విటర్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి బడా టెక్‌ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. హెచ్‌ఆర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధిక మందిపై వేటు పడుతోంది. మరోవైపు మన దేశంలో కూడా ఐటీ ఉద్యోగులు కొత్తగా ఎవరినీ తీసుకోవం లేదు. తాజా వార్తల ప్రకారం గత మూడు నెలల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి నాలుగు ప్రధాన కంపెనీలు కేవలం 1940 మంది కొత్తవారిని మాత్రమే తీసుకున్నాయి. ఇదే సమయంలో భారీ సంఖ్యల సీనియర్లను తొలగించాయి. కంపెనీల లాభదాయకతను పెంచుకునేందుకు చాలా మంది సీనియర్లను ఐటీ కంపెనీలు వొదిలించుకుంటున్నాయి,