డిస్నీ+ హాట్‌స్టార్ ఆఫర్ ధరల పెంపు
నిన్న మీడియాతో మాట్లాడిన ఎయిర్‌టెల్ యజమాని సునీల్ మిట్టల్ టెలికాం చార్జీలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకెంతో కాలం తక్కువ ధరకు ఆఫర్ చేయలేమని చెప్పారు. ఈ విషయమై రిలయన్స్ జియో, వోడాఫోన్‌తో కూడా మాట్లాడుతానని, ఒక యూజర్ నుంచి కనీసం సగటున రూ. 200 కంపెనీకి వచ్చేలా చార్జీలను ప్లాన్ చేస్తామని చె్పారు. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే ఎయిర్ టెల్ కంపెనీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కలిపి వచ్చే మొబైల్ ప్రీపెయిడ్, ఇంటి బ్రాడ్‌బ్యాండ్ పథకాల ధరలు పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. 28 రోజుల కాలవ్యవధి కలిగిన ప్రీపెయిడ్ మొబైల్ పథకాల ధరను రూ.448 నుంచి రూ.499; 56 రోజుల వ్యవధి ధరను రూ.599 నుంచి రూ.699; ఏడాది కాలవ్యవధి ప్యాక్ ధరను రూ.2698 నుంచి రూ.2798కు ఎయిర్‌టెల్ పెంచింది.