For Money

Business News

అదానీ చేతికి డీబీ పవర్‌

డీబీ పవర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. రూ.7,017 కోట్లకు ఈ డీల్‌ కుదిరినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గిర్‌ చంపా జిల్లాలో డీబీ పవర్‌కు 600 మెగావాట్ల రెండు యూనిట్ల థర్మల్‌విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో 923.5 మెగావాట్ల విద్యుత్‌ కొనేందుకు ఒప్పందం కూడా ఉంది. తాజా డీల్‌ కింద మొత్తం వాటా అదానీ పరం కానుంది.