UPI ద్వారా ఏటీఎం నుంచి నగదు డ్రా
డెబిట్ కార్డ్ అవసరం లేకుండా యూపీఐ సాయంతో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసే విధానానికి సిద్ధం కావాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ లావాదేవీలు నిర్వహించాలంటే బ్యాంకులు, ఏటీఏం ఆపరేటర్లు తమ ఏటీఎంలను, అంతర్గత సాఫ్ట్‌వేర్‌ను యూపీఏకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఈ అప్డేషన్ తరవాత కస్టమర్లు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్ డ్రా ఆప్షన్… సెలక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మీ మొబైల్‌తో స్కాన్ చేసి… కావాల్సిన మొత్తం, యూపీఐ కోడ్ ఎంటర్ చేస్తే చాలు.. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఈ కార్డ్‌లెస్ సేవలను బ్యాంకులు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. విత్డ్రాల్స్ పరిమితి కూడా కస్టమర్‌కు ఇపుడు ఎంత ఇస్తున్నారో… అదే పరిమితి యూపీఐకు వర్తిస్తుంది.