For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఒకదశలో నిఫ్టి 15,440కి చేరింది. అధిక స్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణంగా ఇపుడు 35 పాయింట్ల నష్టంతో 15,400 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు మినహా మెజారిటీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 31 షేర్లు ఇపుడు నష్టాల్లో ఉన్నాయి. ఆకర్షణీయ పలితాలు ప్రకటించిన దివీస్ ల్యాబ్‌ ఇవాళ టాప్ గెయినర్‌గా నిలిచింది. అన్ని సెక్టర్లు డల్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆటో అమ్మకాల్లో పెద్ద వృద్ధి కన్పించడం లేదన్న వార్తతో ఆటో రంగంలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి ఇవాళ డే ట్రేడర్స్‌కు లాభాలు ఇవ్వడం అనుమానంగానే ఉంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,300-15,350 మధ్య కొనుగోలు చేయొచ్చు. కాని స్టాప్‌లాస్‌ కచ్చితంగా పాటించండి. ఎందుకంటే నిఫ్టి కొత్త గరిష్ఠ స్థాయిలను ఇవాళ తాకడం కష్టంగానే కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
దివీస్ ల్యాబ్‌ 4,263.70 3.48
ఐటీసీ 216.80 1.83
ఏషియన్‌ పెయింట్స్‌ 2,978.15 1.27
హిందాల్కో 392.65 1.26
భారతీ ఎయిర్‌టెల్‌ 529.50 1.13

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఎం అండ్‌ ఎం 801.00 -5.30
టాటా మోటార్స్‌ 314.10 -1.46
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,007.30 -1.18
కోల్‌ ఇండియా 145.40 -1.02
ఐఓసీ 108.75 -1.00