బ్యాంకులు లైసెన్స్లు: ఆరు దరఖాస్తుల తిరస్కరణ
కొత్తగా బ్యాంకులు నెలకొల్పుతామంటూ పెట్టుకున్న ఆరు దరఖాస్తులను భారత రిజర్వు బ్యాంకు తిరస్కరించింది. వీటిలో నాలుగు సాధారణ బ్యాంకులు నెలకొల్పేందుకు ఉద్దేశించినవి కాగా, రెండు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటుకు వచ్చినవి. ఈ సంస్థలు సదరు బ్యాంకులు ప్రారంభించేందుకు పటిష్ఠంగా లేవని ఆర్బీఐ పేర్కొంది.
కొత్త బ్యాంకుల కోసం ఆర్బీఐకి మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయి. తిరస్కరించిన దరఖాస్తులు ఇవి…
బ్యాంకుల కోసం వచ్చనవి…
1. సచిన్ బన్సల్ నేతృత్వంలోని చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ (సచిన్ బన్సల్ ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు)
2. యూఈఏ ఎక్స్ఛేంజీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
3. రెప్కో బ్యాంక్
4. పంకజ్వైష్ అండ్ ఇతరుల దరఖాస్తు
చిన్న బ్యాంకుల కోసం…
5. విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
6. కాలికట్ సిటీ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్