గోధుమల ఎగుమతులపై ఆంక్షలు?
దేశీయంగా గోధమల ధరలు పెరగడంతో వచ్చే జూన్ నుంచి గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 140 కోట్ల డాలర్ల అంటే సుమారు రూ. 10500 కోట్ల విలువైన గోధమలను ఎగుమతి చేసింది. ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నందున దిగుబడి తగ్గవచ్చిన వార్తలు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ఈసారి గోధుమ సేకరణ తగ్గించింది. బయట మార్కెట్లో ధర అధికంగా ఉన్నందున రైతులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు భారీగా అమ్ముతున్నారు. దీంతో జూన్ మధ్య నాటికి అంటే సీజన్ ముగింపు సమయానికి గోధుమ నిల్వలపై ఒక నిర్ణయానికి రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే అప్పటి నుంచి గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించవచ్చని తెలుస్తోంది.