అదానీ విల్మర్‌కు మళ్ళీ జోష్!
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చాయి. దీంతో షేర్‌పై ఒత్తిడి కన్పించింది. ఏప్రిల్ 28న రూ. 878 వద్ద ఉన్న షేర్‌పై వరుసగా లోయర్ సీలింగ్‌లు పడుతూ వచ్చాయి. ఇవాళ ఉదయం షేర్ రూ. 554కు పడిపోయింది. దాదాపు 35 శాతంపైగా క్షీణించిన తరవాత ఇవాళ షేర్‌లో కొనుగోలు ఆసక్తి వచ్చింది. అదానీ విల్మర్ నిన్న రూ.583.25 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం 5 శాతం నష్టంతో షేర్ రూ. 554కు చేరింది. అక్కడి నుంచి కోలుకుని నష్టాలను పూడ్చుకుని 5 శాతం అప్పర్ సీలింగ్ వద్ద షేర్ ముగిసింది. సో.. క్లోజింగ్‌కల్లా షేర్ ధర రూ. 612.40కి చేరింది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం నిలుపుకునేందుకు పలు బ్రాండ్‌లను కంపెకీ కొంటోంది. కొంత మంది అనలిస్టులు ఈ షేర్‌ను రూ. 734 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని సలహా కూడా ఇచ్చారు. మార్కెట్ డల్‌గా ఉన్నా… ఇవాళ బాగా రాణించిన ఈ షేర్ మున్ముందు మార్కెట్ మెరుగుపడితే ఆకర్షణీయ లాభాలను ఈ షేర్ ఇస్తుందని అనలిస్టులు అంటున్నారు.