For Money

Business News

రిలయన్స్‌ జియో పనితీరు ఓకే

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొద్ది సేపటి క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో రిలయన్స్‌ జియో రూ. 20,901 కోట్ల ఆదాయంపై రూ. 4,173 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించన సర్వేలో నిపుణలు మాత్రం రూ. 20800 కోట్ల ఆదాయంపై రూ. 4400 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. ఆదాయం అంచనాల మేరకు ఉన్నా… నికర లాభం మాత్రం అంచనాలకు కాస్త తక్కువగా ఉంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 9514 కోట్ల ఆపరేటింగ్‌ మార్జిన్‌ ప్రకటించగా, ఈ సారి రూ. 10510 కోట్లను ప్రకటించింది. కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 1.1 శాతం పెరిగి రూ. 50.3 శాతానికి చేరింది. ఇటీవల చార్జీల పెంపు కారణంగా కంపెనీ ఫలితాలు మెరుగయ్యాయి.