ఈడీ జప్తు చేసిన ఆస్తులు బ్యాంకులకు
పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే బ్యాంకులకు విజయ్ మాల్యా బకాయి ఉన్న మొత్తం రూ. 9000 కోట్లు. ఈ నేపథ్యంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులకు అప్పగించాల్సిందిగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు ఆదేశించింది. ఈడీ స్వాధీనం చేసుకున్న చాలా వరకు ఆస్తులు… బ్యాంకులకు విజయ్ మాల్యా తనఖా పెట్టిన ఆస్తులే. గతంలో జప్తు చేసిన ఆస్తుల బదిలీని వ్యతిరేకించిన ఈడీ, ఇపుడు బదిలీకి అంగీకరించింది. నిజంగా ఇది బ్యాంకులకు శుభవార్తే. విజయ్మాల్యాకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ,ఐడీబీఐ ఉన్నాయి.
