వంటనూనెలపై పన్నుల తగ్గింపు?
వంటనూనెల దిగుమతులపై పన్నులను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం వంటనూనెల దిగుమతులపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ట్యాక్స్ పేరుతో 5 శాతం సెస్ విధిస్తున్నారు. ఈ సెస్‌ను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ బ్లూమ్‌బర్గ్ ఓ కథనం రాసింది. ఇంకా ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. భారత దేశం తన వంటనూనె అవసరాల్లో 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇటీవల పామోలిన్‌పై ఇండోనేషియా నిషేధం విధించడంతో దేశీయంగా కూడా వీటి ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలులుగా వంటనూనెల ధరలు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో కనీసం సెస్‌ను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.