ఎల్‌ఐసీ ఐపీఓ… సక్సెస్
ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ రెండో రోజే సక్సెస్ అయింది. ప్రభుత్వం మొత్తం 16.2 కోట్లను ఆఫర్ చేయగా 16.24 కోట్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే ఇష్యూకు వంద శాతం ఆఫర్లు వచ్చాయన్నమాట.అయితే రీటైల్ కోటా 90 శాతం పూర్తయింది. కాని పాలసీ దారులు, ఉద్యోగుల కోటాకు మాత్రం అద్భుత రెస్పాన్స్ వచ్చింది. పాలసీదారులకు కేటాయించిన కోటాకంటే 3.01 రెట్లు దరఖాస్తులు వచ్చాయి. ఇక ఉద్యోగుల కోటాకు 2.13 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. క్యూఐబీలకు రిజర్వ్ చేసిన కోటాలో 40 శాతం దరఖాస్తులు రాగా, ఎన్‌ఐఐలకు ఉద్దేశించిన కోటా కూడా 45 శాతం పూర్తయింది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 21000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం పబ్లిక్ ఆఫర్ చేసింది. పబ్లిక్ ఆఫర్ 9వ తేదీ వరకు ఉంటుంది. అలాగే శనివారం కూడా పబ్లిక్ ఆఫర్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దీంతో పబ్లిక్ ఆఫర్ ముగిసే సమయానికి భారీ స్పందన వచ్చే అవకాశముంది.