భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
అమెరికా మార్కెట్ల పతన ప్రభావం భారత మార్కెట్లపై కన్పిస్తోంది. వాల్స్ట్రీట్లోని అన్ని సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో ఉదయ నుంచ ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.68 శాతం నష్టపోగా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మార్కెట్లు 1.6 శాతంపైగా నష్టపోయాయి. ఇవాళ అనేక ఆసియా మార్కెట్లకు సెలవు. చైనా, హాంగ్కాంగ్ వంటి మార్కెట్లకు మేడే సెలవు కాగా, ఇతర మార్కెట్లు రంజాన్ పండుగ కారణంగా సెలవు. ఇక మన సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 260 పాయింట్ల నష్టంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి కూడా భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. రంజాన్ పండుగ సందర్భంగా రేపు మన మార్కెట్లకు సెలవు.