ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు రూ. 820 కోట్లు
ప్రభుత్వం నడుపుతున్న ఏకైక పేమెంట్ బ్యాంక్ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు రూ. 820 కోట్ల ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థ చేరువ కావడానికి పేమెంట్ బ్యాంక్ ప్రయత్నించాలని, అందుకే ఈ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 820 కోట్ల ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ బ్యాంకులో ఇప్పటి వరకు అయిదు కోట్ల ఖాతాలు ఉన్నాయి. 1.36 లక్షల బ్రాంచీల ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. అకౌంట్‌దారుల్లో 48 శాతం మహిళలే.