For Money

Business News

మీడియాలోకి అదానీ గ్రూప్‌

ఎప్పటి నుంచో వినిపిస్తున్న వదంతులు ఇపుడు నిజమయ్యాయి. ఇతర కంపెనీల్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్‌ ఈ సారి ఏకంగా మీడియాలో రంగంలో భారీగా ప్రవేశించేందుకు ఓ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. AMG Media Networks Limited పేరుతో ఈనెల 26న అంటే నిన్న ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని స్టాక్‌ఎక్స్ఛేంజీకి ఇవాళ తెలిపింది. రూ. లక్ష రూపాయల ఆధీకృత, పెయిడప్‌ మూలధనంతో ఇది పూర్తిగా వంద శాతం తన అనుబంధ సంస్థ అని పేర్కొంది. పబ్లిషింగ్‌, అడ్వర్టయిజింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, డిస్ట్రిబ్యూటింగ్‌ వంటి మీడియా సంబంధిత కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ వెల్లడించింది. దీనితో పాటు వివిధ మీడియా నెట్‌వర్క్‌లకు కంటెంట్‌ కూడా ఈ కంపెనీ సరఫరా చేస్తుందని వెల్లడించింది. త్వరలోనే AMG Media Networks Limited తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వెల్లడించింది.