For Money

Business News

MID REVIEW: నష్టాల్లోనే నిఫ్టి

అమెరికా మార్కెట్ల ప్రభావం అన్ని మార్కెట్లపై కన్పిస్తోంది. ఉదయం ఆసియా మార్కెట్లు, ఇపుడు యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్లలో జర్మనీ డాక్స్‌, యూరో స్టాక్స్‌ 50 సూచీలు ఒక శాతం పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. అన్ని మార్కెట్లు నష్టాల్లోఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు అరశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుత ం114 పాయింట్ల నష్టంతో 17278 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. ఉదయం 17196 పాయింట్లకు పడిన నిఫ్టి దాదాపు వంద పాయింట్లు కోలుకుంది. నిఫ్టిని నిఫ్టి బ్యాంక్‌ తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇతర సూచీల్లో నిఫ్టి మిడ్‌ క్యాప్‌, నిఫ్టి నెక్ట్స్‌ స్వల్ప లాభాలతోనే ఉన్నాయి. హిందాల్కో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.