భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి
ఉదయం నుంచి చివరి వరకు ఇవాళ మార్కెట్ లాభాల్లో కొనసాగింది. 17234 వద్ద ప్రారంభమైన నిఫ్టికి మిడ్ సెషన్లో గట్టి మద్దతు లభించింది. దీంతో చివరి దాకా అప్‌ట్రెండ్ కొనసాగింది. అనేక షేర్లు భారీ లాభాలు గడించాయి. నిఫ్టి 17392 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 256 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని సూచీలు ఒకేస్థాయి లాభాలతో ముగిశాయి. నిఫ్టితో పాటు అన్ని సూచీలు 1.5 శాతం కంటే అధిక లాభాలతో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి బంధన్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ టాప్‌లో ఉన్నాయి. చాన్నా ళ్ళ తరవాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.7 శాతం లాభంతో ముగిసింది. గ్లాండ్ ఫార్మా, బయోకాన్, జూబిలియంట్ ఫుడ్ వంటి షేర్లు 5 శాతం కంటే అధిక లాభాలతో ముగిశాయి. ఫార్మా షేర్లలో సన్ ఫార్మా ఆకర్షణీయ లాభాల్లో ముగిసింది. దివీస్ ల్యాబ్ చివరి అరగంటలో సగం లాభాలు పొగొట్టుకుంది. నిన్న క్లోజింగ్ రూ. 4455 నుంచి రూ. 4550కి చేరిన దివీస్ ల్యాబ్… చివరలో రూ. 4510 వద్ద ముగిసింది.