17200పైన నిఫ్టి ప్రారంభం
నిఫ్టి ఓపెనింగ్‌లోనే వంద పాయింట్లకు పైగా లాభపడింది. ఓపెనింగ్‌లోనే 17253ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17241 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి ఇవాళ 0.82 శాతం లాభంతో ట్రేడవుతోంది. వేసవి ఎఫెక్ట్‌తో అనేక పవర్, విద్యుత్ సంబంధిత కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ 5లో ఉంది. రాత్రి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడీఆర్ రెండు శాతంపైగా పెరిగినా.. మన మార్కెట్‌లో ప్రస్తుతానికి ఆ ఉత్సాహం లేదు. స్వల్ప లాభంతో ఉంది. చాలా రోజుల తరవాత నెస్లే టాప్ లూజర్‌గా నిలిచింది. మెటల్ షేర్లలో ఒత్తిడి కన్సిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా రిలయన్స్ నిఫ్టి టాప్ 5లో ఉండటం విశేషం.