For Money

Business News

లాంగ్‌ పొజిషన్‌ తీసుకోండి… సుఖాని

నిఫ్టి ఇవాళ్టికి అంటే డే ట్రేడింగ్‌ కోసం లాంగ్‌ పొజిషన్‌ తీసుకోవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని సలహా ఇస్తున్నారు. నిఫ్టి 17,200పైన నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని.. అయితే ఇది కేవలం డే ట్రేడింగ్‌ కోసమేనని ఆయన అన్నారు. 17100 స్టాప్‌లాస్‌గా ఉంచుకుని ట్రేడ్‌ చేయొచ్చని అంటున్నారు. షేర్ల విషయంలో లారస్‌ ల్యాబ్‌, పెట్రోనెట్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇచ్చారు. అయితే ఇండిగో షేర్‌ను షార్ట్‌ చేయమన్నారు. మరో స్టాక్‌ అనలిస్ట్‌ మితీష్‌ టక్కర్‌ కూడా నిఫ్టిని కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. శ్రీసిమెంట్‌ను డే ట్రేడింగ్‌కు అమ్మొచ్చని అన్నారు.