ఇక ఎల్ఐసీలోనూ విదేశీ పెట్టుబడులు
ఎల్ఐసీలో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతిస్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. మే నెలలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ రానున్న నేపథ్యంలో కేంద్రం ఈ మార్పులు చేసింది. ఎల్‌ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తూ ఫెమా నిబంధనలను గతంలోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు గత నెల 14న డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఐపీవో ద్వారా ఎల్ఐసీలో రూ.63 వేల కోట్ల విలువైన (ఐదుశాతం) వాటాలను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసింది. దేశీయంగా స్టాక్ మార్కెట్ డల్‌గా ఉండటంతో… ఈ మొత్తం దేశీయ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం కష్టమని భావించిన కేంద్రం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చింది.