HDFC Bank: 23 శాతం పెరిగిన లాభం
మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,055 కోట్ల నికర లాభం ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ఆర్జించిన రూ. 8,187 కోట్లతో పోలిస్తే నికర లాభం 22.8 శాతం పెరిగింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో రూ. 10,200 కోట్ల నికర లాభం వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే వీరి సర్వేలో నికర వడ్డీ ఆదాయం (NII)రూ. 19,400 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, రూ. 18,872 కోట్ల ఎన్ఐఐని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ NII రూ. 17,120 కోట్లు. మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏల శాతం 1.17 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 1.26 శాతం ఉండేది. రుణాల మంజూరీ 20.8 శాతం పెరగి రూ 13,68,821 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 28.8 శాతం పెరిగి రూ. 7,637 కోట్లకు చేరింది. అలాగే ట్రేడింగ్ ఆదాయం కూడా 10.6 శాతం పెరిగి రూ. 5,360 కోట్లకు చేరింది. బ్యాంక్ డిపాజిట్లు కూడా 16.8 శాతం పెరిగి రూ. 15,59.217 కోట్లకు చేరింది.