For Money

Business News

సిటీ కేబుల్‌పై దివాలా పిటీషన్‌

సుభాష్‌చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్‌ గ్రూప్‌ కంపెనీ అయిన సిటీ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ (గతంలో సిటీ కేబుల్‌ నెట్‌వర్క్‌)పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (NCLT)లో HDFC పిటీషన్‌ దాఖలు చేసింది. తనకు బకాయి ఉన్న రూ. 296 కోట్లు చెల్లించడంలో కంపెనీ విఫలమైందని HDFC పేర్కొంది. మల్టి సిస్టమ్‌ ఆపరేటర్‌ (MSO) అయిన సిటీ నెట్‌వర్క్స్‌ తనకు నోటీసు వచ్చిన విషయాన్ని ధృవీకరించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఈ సమాచారం అందింది. ఏప్రిల్‌ 13వ తేదీన తనకు నోటీసు అందినట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిటీ నెట్‌వర్క్స్‌ రూ. 290.06,48,008 బకాయి ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. దేశ వ్యాప్తంగా 580 ప్రాంతాల్లో 1.13 కోట్ల సబ్‌స్క్రయబర్లకు సిటీ నెట్‌వర్క్‌ సర్వీసులు అందిస్తోంది.