For Money

Business News

స్పోర్ట్స్‌ 18 ఛానల్‌ ప్రారంభం

వయాకామ్‌ 18 ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు స్పోర్ట్స్‌ ఛానల్‌ను ప్రారంభించింది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్క్‌ 18కు చెందిన వయాకామ్‌ పూర్తిగా స్పోర్ట్స్‌ న్యూస్‌ కోసం ఒక ఛానల్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి. హెచ్‌డీతోపాటు ఎస్‌డీలో కూడా లభించే ఈ పే ఛానల్‌ నుంచి అనేక అంతర్జాతయ క్రీడలను చూసే అవకాశం ఉంటుందని వయాకామ్‌ స్పోర్ట్స్‌ సీఈఓ అనిల్ జయరాజ్‌ అన్నారు. ఫిఫా వరల్డ్‌ కప్‌ కతర్‌ 2022, ఎన్‌బీఏ, లాలిగా లీగ్‌ వన్, సిరీస్‌ ఏ, అబుదబి టీ10,ఇతర ప్రధాన ఏటీపీ, బిడబ్ల్యూఎఫ్‌ ఈవెంట్‌లను ఈ ఛానల్లో చూడొచ్చు. ఆడ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లలోవూట్‌, జియో టీవీ ఓటీటీలలో కూడా చూడొచ్చు.