For Money

Business News

ఐఫోన్‌ 14 ప్రత్యేకత…శాటిలైట్‌ కనెక్టివిటి

ఐఫోన్ 14 రెడీ అవుతోంది. ఎపుడూ ఏదో ఒక కొత్తదనంతో రావడం యాపిల్‌ ప్రత్యేకత. మొబైల్‌ కనెక్టివిటీ లేని సమయంలో ఎమర్జన్సీ సర్వీసు అవసరమైతే ఎలా? ఈ ఆలోచనకు సమాధానమే ఈ కొత్త ఫీచర్‌. ఈసారి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జన్సీ సర్వీసులకు ఫోన్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అదే శాటిలైట్‌ కనెక్టివిటి. సెల్‌ సిగ్నల్‌ లేనపుడు చిన్న మెసేజ్‌లు పంపేందుకు శాటిలైట్‌ కనెక్టివిటి ఉండేలా కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేస్తున్నారు. ఇదే తరహా ఫీచర్‌ను యాపిల్‌ వాచ్‌లో కూడా పొందుపరుస్తున్నారు. Emergency Services via Contactsను ఐఫోన్‌ 14లో పొందు పరుస్తున్నారు. దీని ద్వారా సంక్షిప్త సమాచారం పంపే వీలు ఉంటుంది.