లాభాల్లో స్టాక్ మార్కెట్లు
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా జేపీ మోర్గాన్ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నా డౌజోన్స్ ఒక శాతంపైగా లాభపడింది.ఇక నాస్డాక్ ఏకంగా 2 శాతం పైగా లాభంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ ఒక శాతంపైగా లాభపడింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్ డిస్కౌంట్ చేసినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతానికి డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గడానికి మార్కెట్ స్పందిస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.26 శాతం లాభంతోఉంది. చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్లకు పెలవు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ, గుడ్ ఫ్రైడే సందర్భంగా రేపు మార్కెట్లకు సెలవు. కమాడిటీ మార్కెట్లు మాత్రం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటాయి. రేపు అన్ని మార్కెట్లు పూర్తిగా మూసి ఉంటాయి.