కార్డ్ లేకుండానే నగదు విత్‌డ్రా
కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ ఇవాళ ప్రకటించింది. ఇవాళ పరపతి విధానం ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ శవికాంత దాస్ ఈ విషయం వెల్లడించారు. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.ఇపుడు కొన్ని బ్యాంకుల్లో మాత్రమే UPI ద్వారా కార్డ్‌లెస్ విత్‌డ్రాలకు వీలు ఉందని… ఇక నుంచి అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా అవకాశాన్ని కల్పిస్తామని శక్తికాంత్ దాస్ తెలిపారు. సాధారణంగా ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రా చేయాలంటే బెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉండాలి. కార్డ్ లెస్ విత్‌డ్రా పద్దతిలో ఇవి రెండూ లేకున్నా ఏటీఎం నుంచి నగదును డ్రా చేయొచ్చు. ఈ పద్ధతి అమల్లోకి వచ్చినా… క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.