రివర్స్ రెపో రేటు పెంచితే ఏమౌతుంది?
రెపో రేటను పెంచకుండా ఆర్బీఐ ఇవాళ రివర్స్ రెపో రేటును పెంచింది. పరోక్షంగా మార్కెట్లో వడ్డీ రేట్లను పెంచేందుకు అనువైన వాతావరణానికి వీలు కల్పిస్తోంది. రివర్స్ రెపో రేటు అనేది కూడా వడ్డీనే. బ్యాంకులు తన వద్ద ఉంచే డిపాజిట్లపై ఆర్బీఐ చెల్లించే రేటును రివర్స్ రెపో రేటు అంటారు. సాధారణంగా మార్కెట్లో ఉత్సాహపూరిత వాతావరణం లేపుడు… బ్యాంకుల తమ వద్ద ఉన్న మిగులు మొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచుతాయి. ఇపుడు అలా మొత్తాలపై ఇచ్చే వడ్డీని ఆర్బీఐ పెచండంతో … ఇక నుంచి బ్యాంకులు తమ వద్ద ఉన్న అధిక మొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచేందుకు ఇష్టపడుతాయి. అంటే మార్కెట్లో దీనికన్నా ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అయితేనే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. పరోక్షంగా బ్యాంకుల వద్ద ఉన్న మిగులు మొత్తాన్ని ఆర్బీఐ లాగేసుకుంటోందన్నమాట. మార్కెట్లో నిధుల కొరత పెరుగుతుంది. మరోలా చెప్పాలంటే తనకు మార్కెట్లో అధిక వడ్డీ గిట్టుబాటు అయితేనే బ్యాంకులు బయట అప్పులు ఇస్తాయి. లేదంటే ఆ మొత్తం ఆర్బీఐ వద్ద ఉంచుకుంటాయి. పరోక్షంగా వడ్డీ రేట్లను పెంచేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది.