డిజిటల్ కరెన్సీపై మరింత అధ్యయనం
ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినా… ఈ విషయంలో జాగ్రత్తగా ఆయన అన్నారు. క్రిప్టోకరెన్సీలను కట్టడి చేసే విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ అధికారికంగా ఎక్కడా డిజిటల్ కరెన్సీ వినియోగంలో లేనందున దాని ప్రభావాలను ముందుగా అంచనా వేయగలిగే పరిస్థితి లేదని రవి శంకర్ చెప్పారు.