ఒక మోస్తరు నష్టాల్లో వాల్‌స్ట్రీట్
గత రెండు రోజులతో పోలిస్తే అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నాస్డాక్ 0.76 శాతం, ఎస్ అండ్ పీ 500 0.44 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ కూడా 06 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ప్రధాన టెక్ షేర్లు ఒక శాతం మేర నష్టపోయాయి. హెచ్‌పీ మాత్రం 15 శాతం లాభంతో ట్రేడవుతోంది. పదేళ్ళ అమెరికా బాండ్లపై ప్రతిఫలం ఇవాళ కూడా పెరిగి 2.645శాతానికి చేరింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ తగ్గడంలేదు. ఇవాళ కూడా స్వల్పంగా పెరిగి 99.67 వద్ద ట్రేడవుతోంది.