For Money

Business News

NIFTY TRADE: దిగువన మద్దతు లభిస్తుందా?

మార్కెట్‌ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది. సింగపూర్‌ నిఫ్టి స్థాయి నష్టాలతో ప్రారంభమైతే ఓపెనింగ్‌లోనే అనేక మద్దతు స్థాయిలను నిఫ్టి కోల్పోనుంది. టెక్నికల్‌గా నిఫ్టికి 17873, 17844 వద్ద మద్దతు అందాలి. మరి నిఫ్టి ఈ స్థాయిల వద్ద నిలబడుతుందా లేదా ఓపెనిగ్‌లోనే 17800 స్థాయిని తాకుతుందా అనేది చూడాలి. ఈ స్థాయిలో ప్రారంభం కావడమంటే… డౌన్‌ బ్రేకౌట్‌ దిగువన ప్రారంభమైనట్లే. 17783 చివరి మద్దతు స్థాయి. ఈ స్థాయి కోల్పోతే నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి పెరగనుంది. నిఫ్టికి ఇవాళ్టికి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 18023
రెండో ప్రతిఘటన 17991
తొలి ప్రతిఘటన 17892

నిఫ్టికి కీలకం 17873
తొలి మద్దతు 17844
రెండో మద్దతు 17783
డౌన్‌ బ్రేకౌట్‌17765

నిఫ్టి ఓవర్‌ బాట్‌ జోన్‌లో ఉన్నందు… బై ఆన్‌ డిప్స్‌ వ్యూహం పనిచేయకపోవచ్చు. యుద్ధానికి సంబంధించిన ఏదైనా పాజిటివ్‌ న్యూస్‌ వస్తే తప్ప 17000పైన నిఫ్టి నిలదొక్కుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఈలోగా కార్పొరేట్‌ ఫలితాలు వస్తాయి. ఇన్వెస్టర్లు వాటిపై దృష్టి పెట్టడం మంచిది.