For Money

Business News

17200 దిశగా నిఫ్టి?

హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనే ఈవెంట్‌ తరవాత ఫాలోఅప్‌ ర్యాలీ రానందున నిఫ్టి 17200 దిశగా పయనించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ అభిప్రాయపడుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రకటన రోజు నుంచి ఈ రెండు షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయని… నిన్న ఆ విషయం చాలా స్పష్టంగా కన్పించిందని ఆయన అన్నారు. ఈవెంట్‌కు కొనసాగింపు లేనందున… నిఫ్టి నిన్న క్షీణించిందని… భారీ పతనం లేకున్నా…మరో ర్యాలీకి ముందు నిఫ్టిలో కన్సాలిడేషన్‌ ఉంటుందని అశ్విని గుజ్రాల్‌ అన్నారు. 18000, ఆ పైన ఉన్న కాల్‌ రైటింగ్‌ అన్‌వైండింగ్‌ ఉంటుందని… ఇది జోరుగా ఉంటే.. నిఫ్టి పతనం కూడా జోరుగా ఉంటుందని ఆయన అన్నారు. నిఫ్టిలో లాంగ్‌ పొజిషన్‌ తీసుకోదలచినవారు అనేక అంశాలు పరిశీలించి తీసుకోవాలని ఆయన సూచించారు. భారీ పతనం లేకపోవచ్చని… కాని మార్కెట్‌ దశ, దిశ లేని సమయంలో … ఈవెంట్‌ రోజు ఏర్పడిన గ్యాప్‌ను మార్కెట్‌ ఇపుడు క్లోజ్‌ చేస్తుందని ఆయన అన్నారు. అంటే ఈవెంట్‌కు ముందునాటి స్థితికి నిఫ్టి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి దాదాపు అయిదారు వందల పాయింట్లు పెరిగినా… విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఎలాంటి మద్దతు అందలేదన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.