For Money

Business News

ట్విటర్‌ బోర్డులో ఎలాన్‌ మస్క్‌

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ను తమ బోర్డులో సభ్యునిగా నియమిస్తూ ట్విటర్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC)కి ట్విటర్‌ వెల్లడించింది. ఇటీవల ట్విటర్‌లో 9.2 శాతం వాటాను ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న విషయం తెలిసిందే. కంపెనీలో అతి పెద్ద ఇన్వెస్టర్‌ అతనే. కంపెనీ ప్రమోటర్‌కు కూడా రెండు శాతం వాటా మాత్రమే ఉంది. ఎలాన్‌ మస్క్‌ వాటా తీసుకున్నట్లు వార్త వచ్చిన తరవాత ట్విటర్‌ షేర్‌ 27 శాతం పెరిగింది. ఇవాళ కూడా ప్రి మార్కెట్‌లో షేర్‌ 5 శాతం పెరిగింది.