For Money

Business News

హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా

ఇప్పటికే హైడ్రోకార్బన్స్‌ రంగంలో అన్ని విభాగల్లోనూ విస్తరించిన మేఘా గ్రూపు ఇపుడు హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరిస్తోంది. మేఘా గ్రూపు కంపెనీ డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏతో కలిసి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ఈ రంగంలోకి ప్రవేశిస్తోంది.ఈ ప్రాజెక్టు కింద 3.5 కోట్ల యూరోల (దాదాపు రూ.300 కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇటలీలోని పియుచెంజాలో జరిగిన డ్రిల్‌మెక్‌ బోర్డు సమావేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.