ఎల్పీజీ గ్యాస్ ధర రూ.250 పెంపు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. గృహ వినియోగానికి సంబంధించిన 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై అసాధరణంగా రూ.273.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,460కి చేరింది. మార్చి 1న రూ. 105, మార్చి 22న రూ.9… ఇపుడు రూ.250చొప్పున పెంచాయి. అంటే కేవలం నెల రోజుల్లోనే సిలెండర్ ధర రూ. 346 పెరిగిందన్నమాట.