పడితే కొనండి.. అశ్వనీ గుజ్రాల్
మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. కొనుగోలుకు ఇదొక మంచి అవకాశంగా భావించాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వనీ గుజ్రాల్ అన్నారు. 5పైసా డాట్ కామ్ కోసం ఆయన ఇవాళ్టి ట్రేడింగ్‌పై విశ్లేషణ చేశారు. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందుతుందని, బై ఆన్ డిప్స్ వ్యూహంతో ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్‌ను కొనసాగించవచ్చని ఆయన అన్నారు. నిఫ్టిని 17450 టార్గెట్ కోసం కొనుగోలు చేసే అవకాశముందని అన్నారు. 17300 స్టాప్‌లాస్‌తో కొనమని ఆయన సలహా ఇస్తున్నారు. మార్కెట్ మున్ముందు పెరిగేందుకే అవకాశముందని.. మన మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లు కూడా పెరిగే అవకాశముందని అన్నారు.ఆయన పూర్తి విశ్లేషణ చూసేందుకు దిగువ వీడియో చూగలరు.