బోగస్ లెక్కలు రూ.800 కోట్లు
హీరో మోటొకార్ప్ కంపెనీపై జరిగిన ఐటీ దాడులకు సంబంధించి ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో కంపెనీ పేర్కొనలేదు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీపై జరిపిన ఐటీ దాడుల్లో రూ. 800 కోట్ల విలువైన బోగస్ లావాదేవీలు బయటపడినట్లు ఆ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. కంపెనీ, ప్రమోటర్లకు చెందిన 35 స్థావరాలపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. రహస్య పత్రాలతో పాటు డిజిటల్ సాక్ష్యాలను కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. వ్యాపారం కోసం చేసిన ఖర్చలంటూ పుస్తకాల్లో రాసినా… దానికి రుజువుగా ఎలాంటి సాక్ష్యాలు చూపలేదని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ముసుగులోరూ.800 కోట్ల ఖర్చు చూపారని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో తరలించారని పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీలో 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని, ఇది కొన్ని పేపర్ కంపెనీల ద్వారా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఈ లావాదేవీల్లో రూ. 60 కోట్ల నల్లధనం ఉపయోగించారని ఆర్థిక శాఖ పేర్కొంది.