For Money

Business News

నష్టాలున్నా… నామమాత్రమే

వాల్‌స్ట్రీట్‌ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైనా.. ఇపుడు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.1 శాతం కన్నా తక్కువ నష్టంతో ఉన్నాయి. ఇక డౌజోన్స్‌ 0.3 శాతం నష్టంతో ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో ప్రజల వినియోగం బాగా తగ్గింది. ఉద్దీపన ప్యాకేజీలకు ఫెడలర్‌ బ్యాంక్‌ గుడ్‌బై చెప్పడంతో జనం ఖర్చు తగ్గించారు. అయినా మే నెల వడ్డీ రేట్ల గురించి మార్కెట్‌ ఆలోచిస్తోంది. తన వద్ద ఉన్న రిజర్వ్‌ నుంచి భారీగా క్రూడ్‌ ఆయిల్‌ను విడుదల చేస్తామనని అమెరికా చెప్పడం క్రూడ్‌ ఆయిల్‌ బాగా క్షీణించింది. దీంతో ఎనర్జి షేర్లు నష్టపోయాయి. ఇక నాస్‌డాక్‌ షేర్ల విషయానికొస్తే ఏఎండీ షేర్‌ 5శాతం నష్టపోయింది. టెస్లా లాభాల్లో ఉంది.అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ షేర్లు అరశాతం దాకా నష్టంతో ఉన్నాయి.