ఏపీలో విద్యుత్ చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలను పెంచారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఇవాళ తిరుపతిలో విడుదల చేశారు. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు చొప్పున పెంచారు. ఇక 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల లోపు వినియోగం ఉంటే యూనిట్‌కు రూ.1.40 చొప్పున పెంచుతారు. పెంపుదల తరవాత చార్జీలు ఇలా ఉంటాయి.
30 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.90
31 యూనిట్ల నుంచి 75 యూనిట్ల మధ్య ఉంటే యూనిట్ చార్జి రూ.3
75 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్ చార్జి రూ. 4.50
126 యూనిట్ల నుంచి రూ. 225 యూనిట్ల వరకు యూనిట్ చార్జి రూ. 6
226 యూనిట్ల నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్ చార్జి రూ. 8.75
400 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ. 9.75 చొప్పున వసూలు చేస్తారు.
ఇపుడున్న కేటగిరీలను రద్దు చేసి ఆరు స్లాబులను తీసుకు వచ్చారు.