కమాడిటీస్లోనూ ఆప్షన్స్ వస్తున్నాయి
మన స్టాక్ మార్కెట్లో రోజూ జరిగితే దాదాపు రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్‌లో 90 శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లోనే జరుగుతుంది. చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్స్ చేయాలంటే భారీ పెట్టుబడి ఉండాలి. ఇపుడు కమాడిటీస్లో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్‌కు సెబి అనుమతించింది. కమాడిటీ సూచీల ఆధారంగా ఈ ఆప్షన్స్‌ను నిర్వహిస్తారు. ఎక్స్ఛేంజీలు ప్రతిపాదనలు పంపిన తరవాత వాటిని పరిశీలించి సెబి అనుమతి ఇస్తుంది. ఏ కమాడిటీ సూచీపై ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించాలని భావిస్తున్నారో… ఆ కమాడిటీ సూచీపై గత మూడేళ్ళు జరిగిన ట్రేడింగ్ డేటాను సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నెలవారీ హెచ్చతగ్గులు, రోల్ ఓవర్ ఈల్డ్‌తో నెలవారీ ప్రతిఫలానికి సంబంధించిన డేటాను కూడా సెబీకి సమర్పించాల్సి ఉంటుంది.