For Money

Business News

రేపటి ట్రేడింగ్‌కు ఈ రెండు షేర్లు

ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన చీఫ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ శుక్రవారం ట్రేడింగ్‌ కోసం రెండు షేర్లను రెకమెండ్‌ చేశారు. వాస్తవానికి ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకులకు కోసం ఈ షేర్లను సిఫారసు చేశారు. ఆ షేర్లనే ఇక్కడ ఇస్తున్నాం. ట్రేడ్‌ చేసే సమయంలో స్టాప్‌లాస్‌ మరవొద్దు. మొదటి షేర్‌ ఒబెరాయ్‌ రియాలిటి. ఈ షేర్‌ను రూ. 925- రూ. 930 మధ్య కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేస్తున్నారు. రూ. 895 స్టాప్‌లాస్‌తో రూ. 985 టార్గెట్‌ కోసం ఉంచుకోవచ్చని చెప్పారు. ఇటీవల 900ల వద్ద ఈ షేర్‌ కన్సాలిడేట్‌ అయింది. అనేక బుల్లిష్‌ క్యాండిల్స్‌ ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఈ షేర్‌ పెరుగుతుందని సిఫారసు చేశారు. ఇక ఆయన సిఫారసు చేసిన రెండో షేర్‌ కోరమాండల్‌. ఈ షేర్‌ను మాత్రం ఆయన అమ్మాల్సిందిగా సిఫారసు చేస్తున్నారు. రూ. 815 ప్రాంతంలో ఈ షేర్‌ను కొనాలని పేర్కొన్నారు. రూ. 760 టార్గెట్‌గా పేర్కొన్నారు. స్టాప్‌లాస్‌ రూ.838. అధిక స్థాయిలో ఈ షేర్‌ నిలబడలేకపోతోంది. ఈ షేర్‌ చార్ట్‌లో మల్టపుల్‌ బేరిష్‌ క్యాండిల్స్‌ ఉన్నందున సమీప భవిష్యత్తులో అంటే రూ. 830 వద్ద ఈ షేర్‌కు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. కాబట్టి ఈ షేర్‌ మరింత క్షీణించి రూ. 760కి చేరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.