నష్టాల్లో వాల్‌స్ట్రీట్
ఉ్రకెయిన్ తాజా పరిణామాలు వాల్‌స్ట్రీట్‌లో ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి రష్యా చమురు దిగుమతులకు స్వస్తి పలకాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. గురువారం నాటో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది, గురు, శుక్రవారాలు ఈ సమావేశం ఉంటుంది. గురువారం సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు అవుతారు. ఈ నేపథ్యంలో ముడి చమురు సరఫరాపై ప్రభావం అధికంగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ 6.5 శాతం పెరిగి 114.50 డాలర్లకు చేరింది. దీంతో ఎనర్జీ ప్రధాన కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. ఎస్ అండ్పీ 500 సూచీపై ఒత్తిడి తక్కువగా ఉన్నా (0.26 శాతం నష్టం) మిగిలిన నాస్డాక్, డౌజోన్స్ సూచీలు 0.6 శాతం నష్టంతో ఉన్నాయి. డాలర్ స్థిరంగా ఉంది.