For Money

Business News

స్పుత్నిక్‌ తయారీకి హెటిరోకు అనుమతి

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకాను భారత్‌ ఉత్పత్తి చేయడానికి, విక్రయానికి కేంద్రం నుంచి అనుమతి లభించినట్లు హైదరాబాద్‌ కంపెనీ హెటిరో డ్రగ్స్ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీఈఎసీసీఓ) షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్ల పైబడిన వారికి సింగిల్ డోసులో ఇచ్చే ఈ టీకాకు అనుమతి పొందిన తొలి బయో ఫార్మాసూటికల్ కంపెనీ తమదేనని తెలిపింది. ప్రస్తుతం రెండు డోసుల్లో ఇస్తున్న టీకాలకు మాత్రమే దేశంలో వినియోగ అనుమతి ఉంది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ( RDIF ) ఇక్కడి హెటెరో బయోఫార్మాతో ఒప్పందం చేసుకుంది.