For Money

Business News

క్రిప్టో: నష్టాలను లాభాలతో అడ్జెస్ట్‌ చేయం

క్రిప్టో ట్రేడర్లు భయడినట్లే జరిగింది. క్రిప్టో ట్రేడింగ్‌పై ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన వివరణతో కంగుతిన్నారు.సాధారణంగా ఏ వ్యాపారంలోనైనా కంపెనీ నష్టాలను లాభాలతో అడ్జెట్‌ చేయడం సహజం. కాని క్రిప్టో కరెన్సీలలో ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరో క్రిప్టోలో వచ్చిన లాభంతో అడ్జస్ట్‌ చేయడం కుదరదని కేంద్రం తేల్చేసింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు ఎంపీ కార్తి చిదంబరం అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ వివరణ ఇచ్చింది కేంద్రం. ఒక వర్చువల్ డిజిటల్‌ అసెట్‌లో వచ్చిన లాభాలను అదే ఏడాది మరో డిజిటల్‌ అసెట్‌లో వచ్చిన నష్టాలతో భర్తీ చేయలేరని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వివరించారు. ఇది పరిశ్రమ వృద్ధిని దెబ్బ తీస్తుందని, ఒక అసెట్‌లో వచ్చిన నష్టాన్ని మరో అసెట్‌లో వచ్చిన లాభంతో అడ్జెస్ట్‌ చేయకపోతే ట్రేడర్లు తీవ్రంగా నష్టపోతారని వజీరెక్స్‌ సీఈఓ నిశ్చల్‌ శెట్టి అన్నారు. కాయిన్‌ డీసీఎక్స్‌ సీఈఓ సుమిత్‌ గుప్తా కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు.