జీఎస్టీ పరిధిలోకి ‘క్రిప్టో’లు?
క్రిప్టోకరెన్సీ లావాదేవీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిప్టో ఎక్సేఛేంజ్లు అందించే సర్వీసులపై మాత్రమే కేంద్రం 18 శాతం జీఎస్టీను విధిస్తోంది. వీటిని ఆర్థిక సేవల కేటగిరీగా పరిగణించి పన్నులను వేస్తోంది. ఏకంగా క్రిప్టోకరెన్సీలను జీఎస్టీ కిందకు తెస్తే లావాదేవీ మొత్తం విలువపై పన్ను విధించే అవకాశం ఉంటుంది. లాటరీలు, క్యాసినోలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, హార్స్ రేసింగ్ వంటి వాటి కిందకు క్రిప్టోలను తీసుకురావాలని జీఎస్టీ అధికారులు భావిస్తున్నారు. అంటే వీటిపై 28 శాతంగా జీఎస్టీ రేటు విధిస్తారాన్నమాట. అయితే బంగారంపై ఇపుడు 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని… క్రిప్టోలను అదే విధంగా పరిగణించి మూడు శాతం జీఎస్టీ వేయాలనికొందరు సూచిస్తున్నారు. ఇక క్రిప్టో కరెన్సీల మొత్తం లావాదేవీపై జీఎస్టీ విధిస్తే ఈ రేటు 0.1 శాతం నుంచి 1 శాతంగా ఉండనుంది. కాగా ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రేటు 0.1శాతామా లేదా 1 శాతామా అని నిర్ణయించడానికి ముందు.. వీటి వర్గీకరణను ఖరారు చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు.