For Money

Business News

110 డాలర్లు దాటిన క్రూడ్‌ ఆయిల్‌

కేవలం మూడు ట్రేడంగ్‌ సెషన్స్‌లో వంద డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరింది బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై అనిశ్చితి కొసాగడంతో పాటు రష్యా నుంచి క్రూడ్‌ సరఫరా తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో క్రూడ్‌కు డిమాండ్ పెరుగుతోంది. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు. కాని శుక్రవారం క్రూడ్‌ ఆయిల్‌ 8 శాతం దాకా పెరిగింది. ఇవాళ మరో 3 శాతం పెరిగి 110.7 డాలర్లకు చేరింది. WTI క్రూడ్‌ ఆయిల్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఆయిల్‌ 3 శాతం పెరిగి 107.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌కు WTI ఆయిల్‌కు వ్యత్యాసం తగ్గుతోంది. ఏప్రిల్‌ నుంచి రష్యా ఆయిల్‌ సరఫరా రోజుకు 30 లక్షల బ్యారెల్స్‌ తగ్గే అవకాశముందని ఇంటర్నేషనల్‌ ఎనర్జి ఏజెన్సీ (IEA) హెచ్చరించింది. ఇదే నిజమైతే… గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనివిధంగా చమురు సరఫరా తగ్గనుంది. ముఖ్యంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు బాగా పెరుగుతాయని మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.