టాటా సూపర్ యాప్ 8న ప్రారంభం
టాటాగ్రూప్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ యాప్ TataNeuను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది సూపర్ కాబట్టి ఇప్పటి వరకు ఏ యాప్ కూడా ఇవ్వనన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఈ యాప్ను ప్రారంభించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యాప్ను ప్రారంభించిన తరవాత భారీ ఎత్తున నిధులను సమీకరించవచ్చని తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా కొనుగోళ్ళు చేసేవారికి NeuCoinsను ఇస్తారని, వీటిని మళ్ళీ కొనుగోళ్ళకు వాడుకోవచ్చని సమాచారం. ఒక్కో NeuCoin ఒక రూపాయికి సమానమని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని విధంగా పాయింట్ల రిడంప్షన్ విధానం ఉంటుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఈ యాప్ను ఉపయోగించి రుణాలు కూడా పొందే అవకాశముంటుంది.టాటా డిజిటల్ ఈ యాప్ను అభివృద్ధి చేస్తోంది. దాదాపు రెండేళ్ళ నుంచి ఈ యాప్ను అభివృద్ధి చేస్తోంది టాటా డిజిటల్. గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్వయంగా ఈ యాప్ అభివృద్ధిని పర్యవేక్షించారు. ఈ యాప్ను టాటా ఉద్యోగులు ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.