15,000 దిగువన క్లోజైన నిఫ్టి
ఇవాళంతా మార్కెట్ గ్రీన్‌లోనే ఉంది. ఆరంభంలో స్వల్ప ఒత్తిడికి గురై 14,892కి చేరినా… తరవాత కోలుకుంది. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్ బలహీనంగా ప్రారంభం కావడంతో నిఫ్టి ఒత్తిడికి గురైంది. కాని వెంటనే కోలుకుని 14,942 వద్ద అంటే 119 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్లు కాస్త కోలుకుని దాదాపు 0.7 శాతం లాభంతో బ్యాంక్ నిఫ్టి క్లోజ్ కావడం విశేషం. ఇక మిడ్ క్యాప్ నిఫ్టి ఏకంగా 1.46 శాతం లాభంతో ముగిసింది. యూరో మార్కెట్లు బలహీనంగా ఉన్నా… అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
కోల్ ఇండియా 148.10 8.22
యూపీఎల్ 679.90 8.02 హిందాల్కో 426.00 6.21
ఐఓసీ 99.20 4.75
ఎల్ అండ్ టీ 1,397.95 4.11
నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీ సిమెంట్ 27,309.95 -1.90
అల్ట్రాటెక్ సిమెంట్ 6,399.00 -1.28
బ్రిటానియా 3,417.00 -1.28
ఇన్ఫోసిస్ 1,339.90 -0.94
హీరో మోటోకార్ప్ 2,839.90 -0.73
