For Money

Business News

14,900పైన ప్రారంభమైన నిఫ్టి

మెటల్స్‌ ఆధ్వర్యంలో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టి ప్రస్తుతం 14,922 పాయింట్ల వద్ద 99 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా మంచి మద్దతు లభిస్తోంది. నిఫ్టటికి ఇపుడు ప్రధాన ప్రతిఘటన స్థాయి 14,960 వద్ద ఎదురు కానుంది. మరి నిఫ్టి ఈ స్థాయికి చేరుతుందా లేదా లాభాల స్వీకరణకు దిగువకు వెళుతుందా చూడాలి. మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా అర శాతం పైగా లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నా బంధన్‌ బ్యాంక్‌ ఆరంభంలో షేర్‌ లాభాల్లో ట్రేడైంది. తరవాత నష్టాల్లోకి జారుకుంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్
టాటా స్టీల్‌ 1,215.40 2.80
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,313.55 2.68 యూపీఎల్‌ 643.45 2.23
హిందాల్కో 408.55 1.86 జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 768.95 1.59

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,456.75 -0.39
మారుతీ 6,679.25 -0.36 హీరోమోటో 2,851.55 -0.32 ఇన్ఫోసిస్‌ 1,349.40 -0.23
సిప్లా 881.30 -0.18