For Money

Business News

డే ట్రేడింగ్‌: సెల్‌ SBI

ఇవాళ మార్కెట్‌ గ్రీన్‌లో ప్రారంభమైనా…బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం బలహీనంగా కొనసాగే అవకాశముంది. డే ట్రేడింగ్‌ కోసం ఎస్బీఐని అమ్మాల్సిందిగా స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సలహా ఇచ్చారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ రూ. 363 స్టాప్‌ లాస్‌తో ఎస్‌బీఐని అమ్మకాలని, టార్గెట్‌ రూ. 351గా ఆయన సూచించారు. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 358.25. అలాగే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ.422.80 కాగా, రూ. 418 స్టాప్‌లాస్‌తో రూ.430 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయాలని సూచించారు. అదానీ పోర్ట్స్‌ను కూడా రూ. 758 స్టాప్‌లాస్‌తో రూ. 780 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ.767.75.